![]() |
![]() |

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్నా ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్, మోనల్ గజ్జర్ తో జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు.
బిబి జోడీలోని మొదటి రెండు వారాల్లో అఖిల్-తేజస్విని వాళ్ళ హాట్ పర్ఫామెన్స్ తో జడ్జ్ లకే చెమటలు పట్టించారు. అయితే ఆ షోలో విన్నర్ గా వీళ్ళ జోడి నిలుస్తుందని అనుకున్నారంతా కానీ అనుకోకుండా అఖిల్ కి కాలికి గాయం కారణంగా డాక్టర్స్ డ్యాన్స్ చేయకూడదని చెప్పడంతో వాళ్ళ జోడీ షో నుండి బయటకొచ్చేసారు.
అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో తన గురించిన అప్డేట్ లని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. " నాకు ఒక రిలేషన్ కావాలి. అది ఎలా ఉండాలంటే హాట్ గా ఉండాలి. ఇంకా అధిక సంపదతో ఇద్దరమే సంతోషంగా ఉండాలి" అని పోస్ట్ చేసాడు అఖిల్. అయితే అఖిల్ రెగ్యులర్ గా జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కాగా ఇప్పుడు తనకొక గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ ఓపెన్ గా చెప్పాడు అఖిల్ సార్థక్.
![]() |
![]() |